Sunday, April 28, 2024

LSG vs PBKS | టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ల‌క్నో..

ఐపీఎల్ 2024 లలో భాగంగా నేడు (శనివారం) పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జేయింట్స్ జట్టు తలపడనుంది. హోమ్ గ్రౌండ్ అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. లక్నో బ్యాటింగ్‌తో బరిలోకి దిగనుంది. కాగా, పంజాబ్ ఇప్పటికే శుభారంభం చేయగా.. లక్నో తొలి విజయం కోసం పోరుకు సిద్ధమైంది.

రాజస్థాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో లక్నో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్నో సొంత గడ్డపై జరిగే ఈ పోరులో గెలిచి ఐపీఎల్‌లో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. పంజాబ్ తొలి మ్యాచ్‌లో గెలిచినా, రెండో మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది. దీంతో పంజాబ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే పట్టుదలతో ఉంది.

జ‌ట్ల వివ‌రాలు :

పంజాబ్ కింగ్స్ :

శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

లక్నో సూపర్ జెయింట్స్ :

- Advertisement -

లోకేష్ రాహుల్, క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement