Sunday, May 19, 2024

EC ORDERS |సంక్షేమ ప‌థ‌కాల విధుల‌కు వాలంటీర్ల దూరం..

ఏపీ వాలంటీర్లు షాక్‌కు గురయ్యారు ఎన్నికల సంఘం. ఏప్రిల్ 1న పింఛన్లు పంపిణీ చేయాల్సిన నేలథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వలంటీర్లను ఉపయోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీని చేయవద్దని ఆంక్షలు విధించింది.

అంతే కాకుండా వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను వెంటనే సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలను కొనసాగించవచ్చని సీఈసీ స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో పింఛనుదారులకు నగదు చెల్లింపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించింది. సీఈసీ విధించిన ఈ ఆంక్షల నేపథ్యంలో.. పెన్షనర్లకు నగదు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement