Friday, April 26, 2024

ఫుల్ స్పీడ్ లో వెంకీ – దృశ్యం 2 లేటెస్ట్ అప్డేట్

విక్టరీ వెంకటేష్ రీమేక్ సినిమాలు చెయ్యటంలో ముందుంటారు. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ , అలాగే మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 రీమేక్ లో నటిస్తున్నాడు. అసురన్ రీమేక్ నారప్ప ను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసి రిలీజ్ ఈ సినిమా సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా మరో హిట్ చిత్రం దృశ్యం 2 రీమేక్ షూటింగ్ ను కూడా వెంకీ స్పీడ్ అప్ చేశాడు.

మళయాళంలో సూపర్ సాధించిన ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమాకు డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్ తన పార్ట్ వరకు షూట్ మొత్తం కంప్లీట్ చేసేసాడట.మిగిన భాగాన్ని ఇప్పుడు షూట్ చేస్తున్నారని తెలుస్తుంది.అయితే వెంకీ షూట్ కంప్లీట్ అయినట్టు ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement