Sunday, May 19, 2024

DNS | ధనుష్-నాగ్ సినిమాకి రాక్‌స్టార్ మ్యూ‌‌జిక్ !

ధనుష్, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. #DNS అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. దీనికి సంబంధించి అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌.

ఇక ప్రస్తుతం డీఎస్పీ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’, ‘కంగువ’, ‘తండేల్’, అజిత్ ‘AK63’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ‘రత్నం’ వంటి క్రేజీ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు. గతంలో నాగార్జునకు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు దేవి. అలానే ధనుష్ తోనూ రెండు తమిళ సినిమాలకు వర్క్ చేసారు. ఇప్పుడు టాలీవుడ్ – కోలీవుడ్ స్టార్ హీరోలిద్దరూ కలిసి నటిస్తున్న DNSసినిమాకి సంగీతం అందించడానికి రెడీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement