Sunday, April 28, 2024

క్రికెటర్‌తో దర్శకుడు శంకర్ కుమార్తె పెళ్లి!

ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య వివాహం తమిళనాడుకు చెందిన క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో ఘనంగా జరిగింది. చెన్నైలో ఇరు కుటుంబాల వారు, వారి సన్నిహితుల సమక్షంలో కరోనా నిబంధనల నడుమ ఈ వీరి వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహ పలవురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరైయ్యారు.

శంకర్ కుమార్తె ఐశ్వర్య వైద్యురాలు కాగా, రోహిత్ దామోదరన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్ పీఎల్)లో మధురై పాంథర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐశ్వర్య, రోహిత్ దామోదరన్ ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘మా’లో ఎన్నికల వేడి.. మంచు విష్ణు లక్ష్యంగా ఏంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement