Monday, April 29, 2024

తెలుగులో ‘డీడీ రిటర్న్స్‌’

మన్మథ, నేనే అంబానీ, రాజు రాణి.. ఇలా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచతమైన తమిళ నటుడు సంతానం. ఆయన హీరోగా నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘డీడీ రిటర్న్స్‌’. సురభి హీరోయిన్‌. ఈ చిత్రానికి యస్‌. ప్రేమ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. సి. రమేష్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం జులై 29న తమిళంలో విడుదలై విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై నిర్మాతలు ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్‌ ఆగష్టు 18న ఈ చిత్రాన్ని ‘డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు

. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో యూనిట్‌ తెలుగు -టైలర్‌ని లాంచ్‌ చేసింది.హీరో సంతానం మాట్లాడుతూ ”డీడీ రిటర్న్స్‌ తమిళ్‌ లో బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యింది. నా సినిమా తెలుగులో విడుదల చేయడం నా డ్రీం. ఇప్పుడు డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా చిత్రంతో తెలుగులోకి రావడం ఆనందంగా వుంది. ఇది ఒక రోలర్‌ కోస్టర్‌ ఫన్‌ రైడ్‌. హారర్‌ కామెడీ విత్‌ గేమ్‌ తో వున్న ఈ చిత్రాన్ని పిల్లలు కూడా చాలా ఎంజాయ్‌ చేస్తారు. అన్నారు.సురభి మాట్లాడుతూ తెలుగులో పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాం. సంతానం గారితో పని చేయడం గొప్ప అనుభవం.

అన్నారుదర్శకుడు యస్‌. ప్రేమ్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం. తమిళ్‌ లో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకోవడం ఆనందంగా వుంది. ఈ చిత్రం తెలుగులో విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఆగస్ట్‌ 18న సినిమా విడుదలౌతుంది. అందరూ సినిమా చూసి ఎంజాయ్‌ చేయాలి అని కోరారు.రమేష్‌ కుమార్‌, ఎన్వీ ప్రసాద్‌, వాకాడ అప్పారావు కూడా మాట్లాడారు

Advertisement

తాజా వార్తలు

Advertisement