Monday, April 29, 2024

‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ నుంచి ఉల్టా పల్టా సాంగ్‌ రిలీజ్

సయ్యద్‌ సోహైల్‌ రియాన్‌, రూపా కొడవాయుర్‌ జంటగా నటిస్తున్న ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న విడులకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి రూపొందించారు. తాజాగా ఈ సినిమా నుంచి ”ఉల్టా పల్టా… ” పాటను విడుదల చేశారు. హైదరాబాద్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో

దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి మాట్లాడుతూ ”ఈ కాన్సెప్ట్‌ క్రియేట్‌ చేసేందుకు నా రియల్‌ లైఫ్‌ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకున్నాను. అమ్మతనం అనే బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటు-ందనే ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నా. చాలా జాగ్రత్తగా, కత్తి మీద సాములా రూపొందించాం. అన్నారు.

హీరో సోహైల్‌ మాట్లాడుతూ నేను మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ కథే చేద్దామని ఫిక్స్‌ అయ్యాను. ఎందుకంటే ఇవాళ ఓటీ-టీ-ల్లో డిఫరెంట్‌ కం-టె-ంట్‌ చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మా సినిమా కూడా వాళ్లకు అలాంటి అనుభూతి అందిస్తుందని నమ్మాను. హుందాగా ఒక కథను తెరకెక్కించాం. సినిమా చూశాక మీ సిస్టర్స్‌, మదర్‌ ను హగ్‌ చేసుకుంటారు. ఈ సినిమా ఒప్పుకున్న -టైమ్‌ లో మా సిస్టర్స్‌ ఇద్దరు ప్రెగ్నెంట్స్‌ గా ఉన్నారు. వాళ్లను చూస్తూ ప్రెగ్నెంట్‌ వుమెన్‌ బాడీ లాంగ్వేజ్‌ నేర్చుకున్నా. అన్నారు.

హీరోయిన్‌ రూపా కొడవయూర్‌ మాట్లాడుతూ – మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమాలో ఎంత ఫన్‌ ఉంటు-ందో అంత ఎమోషన్‌ ఉంటు-ంది. అని చెప్పింది

- Advertisement -

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ -టైలర్‌ రిలీజైన కొద్ది రోజుల్లోనే అన్ని ఏరియాల బిజినెస్‌ కంప్లీట్‌ అయ్యింది. చిన్న సినిమాగా మొదలై..ట్రేడ్‌ లో రెస్పాన్స్‌ తెచ్చుకుంది మిస్టర్‌ ప్రెగ్నెంట్‌. ఒక స్పెషల్‌ కాన్సెప్ట్‌ తో ఈ మూవీని నిర్మించాం. మహిళలు ఆదరిస్తే ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని మైత్రీ డిస్ట్రిబ్య్రూషన్‌ వాళ్లు చెప్పారు. అన్నారు.

నిర్మాత వెంకట్‌ అన్నపరెడ్డి మాట్లాడుతూ మా సంస్థలో వస్తున్న మరొక డిఫరెంట్‌ మూవీ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ కు నచ్చుతుంది. యూఎస్‌ లో దాదాపు 100 స్కీన్స్ర్‌ లో రిలీజ్‌ చేస్తున్నాం. అన్నారు.

నిర్మాత రవీందర్‌ రెడ్డి సజ్జల మాట్లాడుతూ కథలో మంచి ఎమోషనల్‌ కం-టె-ంట్‌ ఉంది. ఎంటర్‌ -టైన్‌ మెంట్‌ కూడా ఉంది. సో ఆయనకు నచ్చింది. అప్పిరెడ్డి జడ్జిమెంట్‌ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాం. అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement