Monday, April 29, 2024

‘ హూ ‘ మూవీ టైలర్‌ విడుదల

జెడి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్‌ గా తెరకెక్కిన చిత్రం ‘హూ’. ఇటీ-వలే ఈ చిత్రం డబ్బింగ్‌, ఎడిటింగ్‌, వంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది . తాజాగా హైదరబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌ లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా -టైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్ర -టైలర్‌ ను నిర్మాత ప్రసన్న కుమార్‌, నటుడు నాగ మహేష్‌ లు సంయుక్తంగా ఆవిష్కరించగా , పోస్టర్‌ ను ప్రముఖ నిర్మాత ఆచంట గోపీనాథ్‌, నిర్మాత శోభారాణి , ఛాంబర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కొల్లి రామ కృష్ణ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఈశ్వర్‌,బలగం ఫేం సంజయ్‌, నిర్మాత విజయ్‌ డిస్ట్రిబ్య్రూటర్స్‌ మురళి కృష్ణ, రాందేవ్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ కే బాలాజీ మాట్లాడుతూ జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌ మూవీ హూ.ఈ చిత్రంలో జెడి చక్రవర్తి గారి నటన చాలా వైవిధ్యంగా ఉంటు-ంది ఆయన రీసెంట్‌ గా చేసిన ,దయ వెబ్‌ సిరీస్‌ ఓ సంచలనం.అని అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement