Wednesday, May 8, 2024

ప్రైడ్ రైస్ ప్యాకెట్ లో బొద్దింక….హీరోయిన్ ఫైర్

హీరోయిన్ నివేద పేతురాజ్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను నుంచి విశేష ఆదరణ పొందింది నివేద.అయితే ఇంస్టాగ్రామ్ లో నివేద పేతురాజ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే… ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో ఓ బొద్దింక వచ్చిందట. దీంతో ఫుడ్ డెలివరీ రెస్టారెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

బుధవారం సాయంత్రం ప్రైడ్ రైస్ ను ఆర్డర్ చేసిందట నివేద. కానీ ఫుడ్ డెలివరీ అయిన తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేయగా అందులో బొద్దింక చచ్చి పడి ఉందని చెప్పింది. కాగా ఇదే విషయమై చెబుతూ ఇటీవల కాలంలో హోటల్స్ సరిగా పరిశుభ్రతను పాటించడం లేదని అనడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లకు జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement