Wednesday, May 1, 2024

లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు కూడా రాణించడంతో సెన్సెక్స్‌ 392.92 పాయింట్లు లాభపడి 52,699 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 103..50 పాయింట్లు లాభపడి 15,790.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.18గా ఉంది. నిఫ్టీలో ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, అదానీ పోర్ట్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్‌ ఏజీఎం నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు ఫ్లాట్‌గా ముగిశాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, మెటల్‌, బ్యాంక్‌ షేర్లు రాణించగా.. ఫార్మా, ఎనర్జీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement