Saturday, April 27, 2024

హుజురాబాద్‌లో కాషాయ జెండా!

తెలంగాణ రాజకీయాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ సీటును దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, బీజేపీలో దుబ్బాక సీన్ ను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈటల గెలుపును  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఆయన గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

ఇటీవల బీజేపీలో చేరిన ఈటల.. హుజురాబాద్ నిజయోకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. హుజురాబాద్ లో ఆత్మగౌవరమే గెలుస్తుందని.. కాషాయా జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈటలను మళ్లీ గెలిపించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీలో నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో హుజూరాబాద్ లో బీజేపీ మండలాల ఇన్ చార్జ్‌ల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో ఈటల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొన్న దుబ్బాకలో ఎలాంటి ఫలితం వచ్చిందో, రేపు హుజూరాబాద్ లోనూ అదే పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే, బీజేపీ శ్రేణులు దుబ్బాక కంటే కాస్త ఎక్కువే శ్రమించాల్సి ఉంటుందని రఘునందన్ రావు చెప్పారు. దుబ్బాకలో ఎన్నికల సందర్భంగా ఎదురైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నామని, హుజూరాబాద్ లోనూ అందుకు మినహాయింపు కాదన్నారు. అయితే ఇక్కడ దుబ్బాక కంటే రెండు పనులు ఎక్కువే చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జోరు చూపించిన బీజేపీ.. హుజురాబాద్ లో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement