Friday, March 29, 2024

ఫిక్సుడ్ డిపాజిట్.. ఏ బ్యాంకులో బెస్ట్?

ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటు క్రమంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. చిన్న ప్రైవేట్ బ్యాంకులు కూడా పన్ను ఆదా చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను 25-50 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. ఉదాహరణకు, డిసిబి బ్యాంక్ మరియు యస్ బ్యాంక్ పన్ను ఆదా చేసే ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను అంతకుముందు 6.75 శాతం ఉంటే అక్కడి నుండి 6.50 శాతానికి తగ్గించాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా 6.5 శాతం నుండి 6 శాతానికి రేట్లు తగ్గించింది. చిన్న ప్రైవేటు బ్యాంకులు పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై 6.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై ఈ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. డిసిబి బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, యస్ బ్యాంక్ పన్ను ఆదా డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని అందిస్తుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్ 6 శాతం ఇస్తుంది.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు సూర్యోడే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ ఎఫ్‌డీలపై ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.75 శాతం, 6.25 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఎక్కువ. డ్యూయిష్ బ్యాంక్, సిటీ బ్యాంక్ వంటి విదేశీ బ్యాంకులు పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై 6.25 శాతం, 3.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై వరుసగా 5.75 శాతం, 5.35 శాతం, 5.30 శాతం వడ్డీని అందిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు పన్ను ఆదా చేసే ఎఫ్‌డిలపై 5.55 శాతం వడ్డీని, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) 5.50 శాతం, పన్ను ఆదా ఎఫ్‌డీలపై 5.40 శాతం వడ్డీని అందిస్తున్నాయి. పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై బ్యాంక్ ఆఫ్ బరోడా 5.25 శాతం వడ్డీని అందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement