Tuesday, May 7, 2024

Ritu Verma: హోమ్లీ అందాల‌కు రీతూ క్లాసిక్ ట‌చ్…

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటిగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ రీతు వర్మ.. ఈ నటి పెళ్లి చూపులు మూవీ లో హీరోయిన్ గా నటించి ఈ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా తర్వాత రీతూ కి తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి.

తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీతమిళ నటుడు విశాల్ హీరోగా రూపొందిన మార్క్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి ఈ మూవీ ద్వారా తమిళ సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే సినిమాల్లో ఎక్కువ శాతం అందాల ప్రదర్శన చేయకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కాస్త కంట్రోల్ గానే ఉంటూ వస్తుంది. ఈ బ్యూటీ తాజాగా తనకు సంబంధించిన కొన్ని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతున్నాయి..త‌న హోమ్లీ అందాల‌కు క్లాసిక్ ట‌చ్ ఇచ్చిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement