Friday, April 26, 2024

ఉప్పెన డైరెక్టర్ తో చిరు చిన్నల్లుడు ?

ఉప్పెన సినిమాతో డైరెక్టర్ మంచి పేరు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు సాన. ఇక ఈ సినిమా హిట్ కావడంతో వైష్ణవ్ తేజ్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యి బిజీ గా మారాడు. బుచ్చిబాబు మాత్రం ఒక్క సినిమాను కూడా అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. మొదట బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో అది కుదరలేదు. ఇక ఎన్టీఆర్ మళ్లీ ఫ్రీ అవ్వాలంటే ఇంకో ఏడాది పట్టే అవకాశం ఉంది. ఈ లోపు బుచ్చిబాబు రెండు సినిమాలు చేస్తే బెటర్ అని భావిస్తున్నారట సన్నిహితులు.

ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు… మిగిలిన స్టార్ హీరోలు కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. కాబట్టి వాటి డేట్స్ కూడా కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడట. ఇక కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సూపర్ మచ్చి సినిమాలో నటిస్తున్నాడు. అంతే కాకుండా తాజాగా కిన్నెరసాని అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటన్నిటి తర్వాత బుచ్చిబాబు తో కళ్యాణ్ దేవ్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement