Thursday, May 9, 2024

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – చంద్రబాబు

కరోనా సెకండ్ వేవ్ అధికమవుతున్న నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కాగా కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

కెసిఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కెసిఆర్ ఆరోగ్యం సంతరించుకోవాలి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా త్వరగా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement