Sunday, April 28, 2024

మళ్లీ నందమూరి హీరో తోనే బోయపాటి సినిమా ?

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ పూర్ణ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఇదిలా ఉండగా బోయపాటి తన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే దానిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం బోయపాటి తన తరువాత సినిమాను కళ్యాణ్ రామ్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే బోయపాటి శ్రీను కళ్యాణ్ రామ్ కు కథ చెప్పగా కళ్యాణ్ రామ్ ఓకే చేశారట. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ రాజేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement