Sunday, May 19, 2024

“Captain Miller” | తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ !

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో.. అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ పీరియాడికల్ యాక్షన్ డ్రామా “కెప్టెన్ మిల్లర్”. సంక్రాంతి సందర్భంగా.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా తమిళనాడులో విడుదలైంది. అయితే తెలుగు వెర్షన్ అదే తేదీకి విడుదల కావాల్సి ఉండగా టాలీవుడ్‌లో భారీ పోటీ నెలకొనడంతో వాయిదా వేశారు మేకర్స్.

కాగా, తాజాగా ఈ సినిమా తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని తెలుగులో జనవరి 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు ధృవీకరించారు. ఈ భారీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా న‌టించ‌గా.. శివ రాజ్ కుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ తదితరులు ముఖ్య పాత్ర‌లో క‌నిపించారు. నటించగా జివి ప్రకాష్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement