Wednesday, May 15, 2024

నందమూరి నటసింహంతో సి కళ్యాణ్ సినిమా ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ హీరోగా శ్రీ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడట.

శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాను సి కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్లాన్ చేస్తున్నారట. ఎమోషనల్ డ్రామా తోపాటు యాక్షన్ తో ఉండే ఓ కథను బాలయ్య కోసం శ్రీవాస్ రాశాడట. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement