Sunday, May 5, 2024

Bujjikondave | సైంధ‌వ్ మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ రిలీజ్‌..

వెంక‌టేశ్ న‌టిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ ‘‘సైంధవ్‌’’. ఈ సినిమాని హిట్ ఫేం డైరెక్టర్ శైలేష్ కొల‌ను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇక, ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా 2024 జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. కాగా, తాజాగా, ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ బుజ్జి కొండవే అనే
సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘రాంగ్ యూసేజ్’, ‘స‌ర‌దా స‌ర‌దా’ పాట‌లు ఆక‌ట్టుకున్నాయి.

YouTube video

ఇక ఈ సినిమాలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య‌, రుహానీ శ‌ర్మ‌, ఆండ్రియా జెర్మియాలు కీల‌క పాత్ర‌లు పోస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement