Wednesday, May 22, 2024

Bubblegum Teaser | రొమాన్స్ లో రెచ్చిపోయిన రోషన్ కనకాల

ప్రముఖ దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాల అందరికీ సుపరిచితమే. ఇక అతని కొడుకు రాజీవ్ కనకాల, కోడలు సుమ కనకాలను తెలియని వారు ఉండరు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా అక్కడ సుమా ఉండాల్సిందే. ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా పలు మూవీల్లో చిన్న, పెద్ద సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు వీరి వారసుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గతంలో నిర్మల కాన్వెంట్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసిన రోషన్.. ఇప్పుడు క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల ఫేమ్ రవికాంత్ పేరెపు ద‌ర్శ‌క‌త్వంలో బబుల్ గమ్ అనే మూవీతో హీరోగా డెబ్యూట్ చేస్తున్నాడు.

కాగా, తాజాగా ఈ మూవీ టీజర్ ని నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు. మొదటి సినిమాలోనే రోషన్ హీరోయిన్ కి ఘాటు లిప్‌లాక్‌ కి ఇచ్చేశాడు. టీజర్ చూస్తుంటే.. ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెరకెక్కబోతుందని అర్ధమవుతుంది. ఒక రిచ్ గర్ల్.. అండ్ పూర్ బాయ్ మధ్య సాగే లవ్ స్టోరీని కొత్తగా చూపించబోతున్నారు. తెలంగాణ స్లాంగ్ లో రోషన్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తుంది. డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement