Monday, April 29, 2024

బాలయ్య డైరెక్టర్ తో యాక్షన్ హీరో సూర్య !!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ చిత్రంలో బాలయ్య సరసన పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ దుమ్ము దులిపింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది . మొదట అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా హీరో సూర్య పేరు ఇప్పుడు వినిపిస్తోంది. బోయపాటి శ్రీను సూర్య కు ఓ కథ చెప్పాడట. కథ నచ్చడంతో సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. తెలుగులో నేరుగా ఈ సినిమాను రూపొందించి తమిళంలోనూ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement