Thursday, May 2, 2024

మెగాస్టార్ Vs సల్మాన్ ఖాన్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘రాధే’ చిత్ర విడుదల తేదీ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న ఈ మూవీని స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా తెర‌కెక్కిస్తున్నాడు. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మేఘా ఆకాష్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే పూర్తి కాగా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా ప‌డింది. కాగా మే 13న మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఆచార్య’ కూడా విడుదల కాబోతున్న విష‌యం తెలిసిందే. ‘ఆచార్య’ హిందీలోనూ విడుదల కానుండటంతో ‘రాధే’తో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement