Monday, April 29, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్ర‌శాంతంగా జ‌ర‌గాలి – సిబ్బందితో సిపి త‌ఫ్సీర్ ఇక్బాల్….

ఖ‌మ్మం – ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. రేపు జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీస్ సిబ్బంది ఎన్నికల విధులలో చేయవలసిన విధివిధానాలు తెలియజేసేందుకు నగరంలోని పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని అదే తీరును ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రదర్శించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం చేయాలని సూచించారు. ఖమ్మం రూరల్ డివిజన్ ప్రాంతంలో అడిషనల్ డిసిపి లా&ఆర్డర్ మురళీదర్, వైరా డివిజన్ ప్రాంతాలలో అడిషనల్ డిసిపి ఆడ్మీన్ ఇంజరాపు పూజ, కల్లూరు డివిజన్‌లో అడిషనల్ డిసిపి కుమారస్వామి, ఖమ్మం టౌన్ ప్రాంతాలలో ఏఎస్పీ స్నేహ మెహ్రా ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఏ చిన్న సంఘటన జరిగిన వేంటనే అయా ప్రాంతాలకు చేరుకునే విధంగా రూట్ మెబైల్ పార్టీలు, స్టైకింగ్ ఫోర్స్ మరింత వేగవంతంగా స్పందించే విధంగా పకడ్బందిగా ప్రణాళికతో సిబ్బందికి విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా విధినిర్వహణలో వున్న సిబ్బంది ఎట్టిపరిస్ధితిలో పొలింగ్ కేంద్రాల సమీపంలో ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా చూడాల్సిన భాద్యత వుందన్నారు. ఓటర్లు ఆందోళన చేందకుండా ప్రశాంతవంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కువినియోగించుకునేందుకు వీలుగా స్వేచ్చయుత వాతావరణం కల్పించాలన్నారు.
పొలింగ్ సరళిలో భాగంగా మీకు అప్పగించిన భాద్యతలను మాత్రమే సమయస్పూర్తితో సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనవసరమైన విషయాలలో తలదుర్చవద్దని ఆదేశించారు. సమస్యాత్మక పొలింగ్ కేంద్రాలలో ఎప్పటికప్పుడు స్ధానికంగా వున్న పరిస్ధితులను పొలింగ్ సరళి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
సమస్యాత్మకంగా ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు సిబ్బంది చేరుకున్నాయని, అధికారుల నేతృత్వంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఓటర్లతో సమన్వయం పాటిస్తూ సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలన్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది లాఠీ, విజిల్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ,శానిటైజర్స్ ఖచ్చితంగా అందుబాటులో వుఁచుకొవాలన్నారు. విధినిర్వహణలో వున్న సిబ్బంది కోసం ఎక్కడ వుంటే అక్కడికే బోజనాలు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందజేస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement