Monday, May 20, 2024

బ‌న్నీపై బాలీవుడ్ ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు..ఎందుకో తెలుసా..

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఓ బాలీవుడ్ చిత్రంపై అల్లు అర్జున్ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. త్వరలో నేషనల్ లెవల్ లో సూర్య వంశీ చిత్రం విడుదుల కాబోతోంది. ఆ చిత్రానికి కూడా నా శుభాకాంక్షలు. ఇలాంటి చిత్రాలు జనాల్ని మళ్ళీ థియేటర్స్ కు తీసుకురావాలి. సౌత్ ఇండియా తరపున సూర్య వంశీ చిత్రానికి ఆల్ ది బెస్ట్ అని కామెంట్స్ చేశాడు. దాంతో అల్లు అర్జున్ కామెంట్స్ పై సూర్యవంశీ దర్శకుడు రోహిత్ శెట్టి, నిర్మాత క‌ర‌ణ్ జోహ‌ర్ స్పందించారు.

నేను గతంలో కూడా చెప్పాను.. ఇది నా సినిమా కాదు.. మన సినిమా. నీ మద్దతు, ప్రేమకు థాంక్యూ అల్లు అర్జున్. పుష్ప చిత్రానికి కూడా ఆల్ ది బెస్ట్. నువ్వొక రాక్ స్టార్ అంటూ రోహిత్ శెట్టి అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ఇక కరణ్ జోహార్ స్పందిస్తూ.. అల్లు అర్జున్ అసలైన సూపర్ స్టార్.. నీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సూర్యవంశీ చిత్రం నవంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement