Sunday, April 28, 2024

ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్ గా సునీల్.. పోస్ట‌ర్ రిలీజ్

సునీల్ హీరోగా ఒక‌ప‌క్క ..విల‌న్ గా..క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఇలా అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు. కాగా ఆయ‌న మ‌రోసారి హీరోగా మారారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం భువ‌న విజ‌య‌మ్..ఈ మూవీ పోస్టర్ .. వీడియోను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాలో ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్’గా సునీల్ కనిపించ‌నున్నారు. స్టార్ హీరోగా ఆయన ఈ కథలో కనిపిస్తార‌నే విషయం అర్థమవుతోంది. 6 నెలలుగా రెగ్యులర్ కథలు వినీవినీ బోర్ కొట్టేసిందని ప్రీతమ్ కుమార్ అనడం .. చాలామంది దర్శకులు, రైటర్లు ఆయనకి కథలు వినిపించడం .. చివరికి ఆయన ‘భువన విజయమ్’ కథను ఎంచుకోవడమనేది ఈ వీడియోలో చూపించారు. హిమాలయ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఎలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిశోర్ .. శ్రీనివాస రెడ్డి .. పృథ్వీ .. గోపరాజు రమణ .. వైవా హర్ష కనిపిస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement