Tuesday, March 26, 2024

కర్నూలు ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కృష్ణ కాంత్

కర్నూలు జిల్లా ఎస్పీగా జి.కృష్ణ కాంత్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా ఎస్పీకి పోలీసు అధికారులు, ఏఆర్ సిబ్బంది స్వాగతం పలికి గౌరవందనం చేశారు. ఆ తరువాత జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డిజిపికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ గురించి…
జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్వస్ధలం.. అనంతరం పురం జిల్లా, గుత్తి మండలం, ఎస్ఎస్ పల్లె గ్రామం.
పదో తరగతి వరకు అనంతపురం జిల్లా గుత్తి జడ్పీ పాఠశాలలో, గుంతకల్లులోని శంకరానంద స్వామి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, అనంతపురం పట్టణంలోని సీఎంఐ కళాశాలలో బీఎస్సీ బయో టెక్నాలజీ, హర్యానా లోని నేషనల్ డైరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్ లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశామన్నారు. సివిల్స్ రాసి 2017 బ్యాచ్ ఐపీఎస్ కు ఎంపికై ఆంధ్ర క్యాడర్ కు రావడం జరిగిందని తెలిపారు. అడిషనల్ ఎస్పీగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేస్తూ పదోన్నతి పై కర్నూలు జిల్లాకి ఎస్పీగా రావడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement