Sunday, April 28, 2024

బింబిసార గా కళ్యాణ్ రామ్…మరో బాహుబలి

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల ఎంత మంచి వాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ హిట్ ను అందుకోలేకపోయాడు. అయితే ఆ వెంటనే మరో సినిమాని కూడా స్టార్ట్ చేశాడు. కానీ దానిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. కాగా ఈ రోజు ఎన్టీఆర్ 98 వ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.

టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసార పాత్ర లో కనిపించబోతున్నారు. బాహుబలి లెవల్ లో శత్రు సంహారం చేసిన యోధుడిలా ఇందులో ఇందులో కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమాను మగధీర మాదిరి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించారా లేక…ఇంకేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. .

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement