Tuesday, May 14, 2024

తంగలాన్ నుంచి బిగ్ “అప్‌డేట్”.. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా రీలజ్ చేయనున్న మేకర్స్

కోలీవుడ్ స్టార్ విక్రమ్ రేపు (ఏప్రిల్ 17) తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, అతని అప్ కమింగ్ యాక్షన్ డ్రామా, తంగలాన్ సినిమా నుండి ఒక ప్రత్యేక అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. అదే విశయాన్ని తెలియజేస్తూ “స్లైస్ ఆఫ్ ఫ్లెష్” అంటూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విక్రమ్ చాలా కఠినంగా, క్రూరంగా కనిపించాడు. తంగలాన్ కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ప్రఖ్యాత కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. తంగళన్ సినిమాలో బాలీవుడ్ నటి మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement