Wednesday, May 22, 2024

బిచ్చ‌గాడు2.. రెండోరోజు క‌లెక్ష‌న్స్

తెలుగు .. తమిళ భాషల్లో నిన్న విడుదలైంది బిచ్చ‌గాడు2. థియేటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగానే కనిపించింది. అందువలన మంచి ఓపెనింగ్స్ ను ఈ సినిమా రాబట్టినట్టుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 4.10 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తమిళనాడుతో సమానంగా తెలుగు వసూళ్లు ఉన్నాయని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో కలుపుకుని, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ సినిమా 8.15 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని చెబుతున్నారు. హీరో..ద‌ర్శ‌కుడు విజయ్ ఆంటోని ఈ సినిమా కోసం గట్టిగానే ఖర్చు పెట్టారు. ఫస్టాఫ్ కి ఎక్కడా వంక బెట్టడానికి ఉండదు. సెకండాఫ్ లో మాత్రం ఒకటి రెండు చోట్ల కథనం కాస్త మందగిస్తుంది. ఫొటోగ్రఫీ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. వీకెండులో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement