Friday, May 3, 2024

కృష్ణపట్నం సముద్ర తీరంలో స్వచ్ఛ సాగర్.. సురక్ష సాగర్

ముత్తుకూరు మే 20( ప్రభ న్యూస్) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీర ప్రాంతం వెంబడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సాగర్.. సురక్ష సాగర్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అదాని కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఓడరేవు సిబ్బంది నిర్వహించారు్ జిల్లా అటవీ శాఖ తోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ అధికారులు సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పర్యావరణ శాఖ ఇంజనీర్ రాజశేఖర్ హాజరు కావడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు ఉద్యోగులు, కార్మికులు ఉదయం 6 గంటల నుంచి కృష్ణపట్నం సముద్రతీరంలో వ్యర్ధాలను తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్యావరణం శాఖ ఇంజనీర్ రాజశేఖర్ మాట్లాడారు. జిల్లా పర్యావరణ శాఖ, అటవీ శాఖ, ఆదాని కృష్ణపట్నం పోర్టు సహకారంతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని 508 మందితో నిర్వహించినట్లు పర్యావరణం పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ సాగర్ -సురక్ష సాగర్, నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదాని కృష్ణపట్నం పోర్టు ఉద్యోగులు కార్మికులు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. పొల్యూషన్ నిర్మూలన ప్రక్రియలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలని పర్యావరణం కాపాడుతామని పిలుపునిచ్చారు. పోర్టు ఉద్యోగులు, కార్మికులు ఎంత ఉత్సాహంతో సముద్రతీరంలోని వ్యర్ధాలను తొలగించి బయట పడేశారు. ముఖ్యంగా మహిళ ఉద్యోగులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ సెక్షన్ అధికారి జేవిఆర్ ప్రసాద్, సుధ, పోర్ట్ డ్రై కార్గో హెడ్ మనిష్ దావే, పోర్టు సెక్యూరిటీ హెడ్ వెంకటేష్ భాస్కరన్, అడ్మిన్ ఏజీఎం గంగా సతీష్, పోర్ట్ ఎన్విరాన్మెంట్ ఏజీఎం విజయ్ ఫైనాన్స్ హెడ్ గుడివాడ శ్రీకాంత్, హెచ్ ఆర్ డీజీఎం సిహెచ్ శ్రీనివాస్ ఈహెచ్ఎస్ ఏజీఎం వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ బాబు, రామానంద్ యాదవ్, అపర్ణ, కనక లక్ష్మి, పద్మావతి, పుచ్చలపల్లి శ్రీనివాసులు, రాజేష్ యాదవ్, వివిధ విభాగాల హెచ్వోడీలు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement