Sunday, April 28, 2024

భోళాశంక‌ర్ డ‌బ్బింగ్ ప్రారంభం…

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్‌. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిసున్నారు. భోళాశంకర్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం, మెగాస్టార్‌ చిరంజీవి, షావర్‌ అలీ, వజ్ర ఫైటర్స్‌, ఇతర తారాగణం షూటింగ్‌లో పాల్గొంటు-న్న భారీ ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పూజా కార్యక్రమాలతో డబ్బింగ్‌ పనులు ప్రారంభించారు. జూన్‌ చివరి నాటికి ‘భోళా శంకర్‌’ షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వినోదాత్మకంగా ఇంకా యాక్షన్‌తో పాటు- భారీతనంతో చిత్రీకరించిన పాటలు ఉంటాయి. మెహర్‌ రమేష్‌ ఈ చిత్రంలో చిరంజీవిని పూరి సరికొత్త మాస్‌ అవతార్‌లో ప్రజంట్‌ చేస్తున్నారు. తమన్నా కథానా యికగా నటిస్తుండగా, కీర్తి సురేష్‌, చిరంజీవి సోదరిగా కనిపించ నుంది. నటుడు సుశాంత్‌ ఈ సినిమాలో లవర్‌ బాయ్‌ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్‌ కథా పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల సంభాషణలు అందిస్తున్నారు. మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్నారు. కిషోర్‌ గరికిపాటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. ‘భోళా శంకర్‌’ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్‌, సుశాంత్‌, రఘుబాబు, రావు రమేష్‌, మురళీ శర్మ, రవిశంకర్‌, వెన్నెల కిషోర్‌, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్‌ శ్రీను, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌, ప్రభాస్‌ శీను తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement