Monday, April 29, 2024

సైంధ‌వ్ నుంచి జాస్మిన్ ఇంట్రడ‌క్ష‌న్.. పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ సినిమాల‌తో ‘హిట్’ సిరీస్ ని క్రియేట్ చేసి స్టార్ డైరెక్టర్‌గా మారాడు శైలేష్ కొలను. ఇప్ప‌డు అత‌ని డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా న‌టిస్తోండ‌గా.. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌గా, ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘సైంధవ్’ మూవీ.. ప్రస్తుతం వైజాగ్‌లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నెగెటివ్ రోల్ పోషిస్తుండగా.. రీసెంట్‌గా డాక్టర్ రేణు పాత్రను రివీల్ చేశారు. ‘హిట్: ఫస్ట్ కేస్’లో హీరోయిన్‌గా నటించిన రుహానీ శర్మ.. ఈ క్యారెక్టర్ చేస్తోంది. ఇక తాజాగా మరో క్యారెక్ట‌ర్ ని పరిచయం చేశారు మేకర్స్.

సింగర్‌ కమ్ హీరోయిన్‌గా తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించిన ఆండ్రియా ‘సైంధవ్’ చిత్రంలో జాస్మిన్ పాత్రలో కనిపించనుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఒక ఫోటో రిలీజ్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. రిలీజ్ చేసిన పోస్టర్‌లో చేతిలో గన్‌తో ఆమె చూపులు చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తను చాలా సినిమాల్లో నెగెటివ్ టచ్‌తో కూడిన యాక్షన్ ఓరియెంటెడ్ రోల్స్ చేయగా.. ఇందులోనూ తనది అదే తరహా క్యారెక్టర్ అని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇక తెలుగులో మొదటి సినిమా ‘దసరా’తోనే భారీ హిట్ కొట్టిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే ‘సైంధవ్’ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement