Wednesday, May 22, 2024

మెగాస్టార్ ‘భోళా శంకర్’.. ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భోళా శంకర్‌’సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. బుధవారం ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్ డేట్ వచ్చంది. నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు సినిమా ముహూర్తం, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు “భోళా శంకర్” టీమ్ ప్రకటించింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుండి ప్రారంభమవుతుందని చెప్పింది. అయితే, ఈ మూవీలో చిరంజీవికు జోడిగా ఎవరు నటిస్తారు? అన్నది ఇంకా సస్పెన్స్ గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement