Sunday, April 28, 2024

బాల‌య్య బ‌ర్త్ డేకి .. భైర‌వ‌ద్వీపం రీ రిలీజ్

హీరో బాల‌కృష్ణ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. భైర‌వ‌ద్వీపం చిత్రం రీ రిలీజ్ కానుంది. బాలయ్య మాస్ తో పాటుగా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అలా తాను చేసిన ఎన్నో అడ్వెంచర్ మూవీస్ లో .. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కల్ట్ క్లాసిక్ మూవీ అంటే… భైరవ ద్వీపం అనే చెప్పాలి. అటువంటి అద్భుతమైన సినిమాను చాలా మంది థియేటర్లలో చూసి ఉండరు. ఎందుకుంటే ఇప్పటి తరం కుర్రాళ్లు ఆ సినిమా థియేటర్ లో చూసే ఛాన్స్ లేదు.దాంతో ఈమూవీని రీ రిలరీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు టీమ్. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టిలో ఒక చిత్రంగా వచ్చిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ అయితే ఇప్పుడు 4K లో రీరిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాదు ఈసినిమాను బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా.. ఈ జూన్ 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement