Friday, May 10, 2024

Integrated Collectorate – జూన్ లో కొత్త క‌లెక్ట‌రేట్ల‌ను ప్రారంభించ‌నున్న కెసిఆర్

హైద‌రాబాద్ : ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కొత్త‌గా ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ల‌ను నిర్మిస్తున్న‌ది.. దీనిలో భాగంగా నిర్మాణాలు పూర్తి అయిన ప‌లు క‌లెక్ట‌ర్లలో ఇప్ప‌టికే కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయి..మ‌రికొన్నినిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.. ఇది ఇలా ఉంటే ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా మ‌రో నాలుగు జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జూన్ 4వ తేదీన నిర్మల్, 6న నాగ‌ర్‌క‌ర్నూల్, 9న మంచిర్యాల‌, జూన్ 12వ తేదీన గ‌ద్వాల జిల్లా క‌లెక్ట‌రేట్ల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ నాలుగు జిల్లాల క‌లెక్ట‌రేట్ల ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. దీంతో ప‌రిపాల‌న‌ను ఇక్క‌డ నుంచి ప్రారంభించేందుకు కెసిఆర్ లాంచ‌నంగా ఆయా రోజుల‌లో శ్రీకారం చుట్ట‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement