Thursday, May 2, 2024

మొదటి జోనల్ డ్రైవ్‌ను ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్ మోటార్

హైద‌రాబాద్, మే 26 (ప్ర‌భ న్యూస్) : టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశవ్యాప్తంగా మోటారు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, అసాధారణమైన మూడు రోజుల సాహసయాత్రకు నాంది పలుకుతూ గ్రేట్ 4×4 ఎక్స్-పెడిషన్ ను ప్రారంభించింది. ఈ థ్రిల్లింగ్ డ్రైవ్ ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్-రోడింగ్ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం.

ఈసంద‌ర్భంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రేట్ 4×4 X-పెడిషన్ ప్రారంభాన్ని గురించి టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ… టయోటా గ్రేట్ 4×4 X-పెడిషన్ 4×4 అభిమానులతో కనెక్ట్ అయ్యేలా రూపొందించబడిందన్నారు. మరపురాని ఈ ప్రయాణంలో భాగమయ్యే అవకాశాన్ని వారికి అందించడం ద్వారా వారి అనుభవాలను సుసంపన్నం చేస్తుందన్నారు. ఉత్సాహంగా ఈ రైడ్ లో పాల్గొన్న వారందరికీ తాము త‌మ‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వారికి సురక్షితమైన, చిరస్మరణీయమైన, ఉత్తేజకరమైన డ్రైవ్‌ అనుభవాలు లభించాలని కోరుకుంటున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement