Friday, December 6, 2024

TS : వృక్ష వేద్ అరణ్య కొత్త ప్రాజెక్ట్‌కు జోగిన‌ప‌ల్లి శ్రీకారం

- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు జోగినిప‌ల్లి సంతోష్‌కుమార్ మ‌రో బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో గ్రీన్ చాలెంజ్ పేరుతో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేస్తున్నారు. కోట్లాది మొక్క‌లు నాట‌డ‌మే కాకుండా.. చాలెంజ్ రూపంలో ఎందరికో ఆ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇక.. లేటెస్ట్‌గా అస్సాంలోని మొలాయి కథోని ఫారెస్టులో నేడు (గురువారం) వృక్ష వేద్ అర‌ణ్య అట‌వీ ప్రాజెక్టును జోగిన‌ప‌ల్లి సంతోష్ నేడు లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్ర‌ఖ్యాతి గాంచిన‌ ప‌ద్మ‌శ్రీ జాద‌వ్ ప‌యాంగ్‌, గ్రీన్ చాలెంజ్ కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌పి సంతోష్ ఇక్క‌డ ప‌దివేల మొక్క‌ల‌ను నాట‌నున్నారు. ఇవ్వాల‌ నాటే చిన్న మొక్క‌లే వ‌ట‌వృక్షాలై ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు తొడ్ప‌డ‌తాయ‌నే ఆశాభావాన్ని సంతోష్ ట్విట్ట‌ర్ సందేశంలో వ్య‌క్త ప‌రిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement