Saturday, April 27, 2024

పటాస్ తరహాలో బాలయ్య అనిల్ ల సినిమా !!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. అలాగే అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ మాట్లాడుతూ బాలయ్యతో చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పటాస్ తరహాలో ఉండబోతోందట. బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టు గా క్యారెక్టర్ సరిపోతుందని… ఇక ఎఫ్ 3 తర్వాత బాలకృష్ణ సినిమాతోనే సినిమా చేయబోతున్నానని చెప్పుకొచ్చాడు.

అయితే డీసెంట్ కామెడీ హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాలో కూడా తన మార్క్ డైలాగులతో చూపిస్తాడని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికే బాలకృష్ణ సినిమా స్టార్ట్ చేసి ఉండేవాడట.ఇక చాలా సినిమాల షెడ్యూల్స్ కరోనా కారణంగా తారుమారు అయిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement