Sunday, April 28, 2024

‘అఖండ’ ఆఫీషియల్ – బాలయ్య ఉగ్రరూపం

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఉగాది పండుగ సందర్భంగా బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించిన టైటిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాకు ‘అఖండ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది.ఈ మేర పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో త్రిశూలం పట్టుకొని బాలయ్య ఉగ్రరూపంలో కనిపించాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైనఫస్ట్ రోర్ కు విశేషమైన స్పందన లభించింది. కాగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement