Wednesday, May 15, 2024

‘అంటే సుందరానికి’ స్పెషల్ అంటున్న రాజరాణి హీరోయిన్

రాజా రాణి హీరోయిన్ నజ్రియా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు అంటే సుందరానికి సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై నజ్రియా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా ఫస్ట్ తెలుగు మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్ మొదలు పెట్టాను. ఫస్ట్ చేసే పని ఏదైనా స్పెషల్ గా ఉంటుంది. కాబట్టి అంటే సుందరానికి నాకు చాలా స్పెషల్ అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది నజ్రియా

Advertisement

తాజా వార్తలు

Advertisement