Sunday, May 19, 2024

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాపై మరో అప్డేట్!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు.

కాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆగలేదని ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసి ఎన్టీఆర్ సినిమాని 2022 మార్చిలో మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఈ సినిమా తరువాత మరో టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్. అలాగే సంజయ్ లీలా బన్సాలీ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తన తర్వాత సినిమాను ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇప్పటికే కొరటాల సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement