Thursday, May 9, 2024

జాబ్ క్యాలెండర్‌‌కు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ర్యాలీలు

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు ర్యాలీలు చేపట్టాయి. విజయనగరంలో విద్యార్థి సంఘాల నేతలు సోమవారం ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించారు. తొలుత విద్యార్థులు కోట కూడలి వద్ద మానవహారం చేపట్టారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో తక్కువ ఉద్యోగాలకు అవకాశమిచ్చారని విద్యార్థులు ఆరోపించారు.

మరోవైపు విశాఖలోని జీవీఎంసీ వద్ద నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టింది. తక్షణమే మెగా డీఎస్సీ నిర్వహించాలని, అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని యువకులు డిమాండ్ చేశారు. అటు కర్నూలు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోనూ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ సరిగ్గా లేదని నిరుద్యోగులు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement