Sunday, May 5, 2024

రీ-రిలీజ్ ట్రెండ్ లో మ‌రో మూవీ..! జూనియర్​ ఎన్టీఆర్ సినిమా మ‌ళ్లీ థియేటర్ల‌లోకి..!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ న‌డుస్తోంది. మ‌హేష్ బాబు పోకిరి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా, బాల‌కృష్ణ చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాలు థియేట‌ర్ల‌లో రీ-రిలీజై ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. తాజాగా ఈ జాబితాలో ఎన్టీఆర్ సినిమా చేర‌బోతున్న‌ది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సినిమా ఆది. ఫ్యాక్ష‌నిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాతో ఎన్టీఆర్‌లోని మాస్ యాంగిల్‌ను డిఫ‌రెంట్‌గా చూపించారు ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌. ఆది సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్స్‌, మేన‌రిజ‌మ్స్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. 2002లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.

ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ఆది సినిమాను రీ-రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి తెలిపారు. న‌వంబ‌ర్ థ‌ర్డ్ వీక్‌లో ఆది సినిమాను థియేట‌ర్ల‌లో రీ-రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో భారీగా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement