Saturday, April 27, 2024

అన్న‌పూర్ణ‌స్టూడియోలో స‌మంత‌.. ఎందుకో తెలుసా..

ప్రేమించి, పెళ్ళాడిన జంట‌, న‌టులు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు.వీరి వివాహ‌బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ మేర‌కు విడాకుల‌కు అప్లై చేశారు. ఈ నేప‌థ్యంలో అన్న‌పూర్ణ స్టూడియోలో ద‌ర్శ‌న‌మిచ్చింది హీరోయిన్ స‌మంత‌. ఈ స్టూడియోలో షూటింగ్ లే కాదు డ‌బ్బింగ్ కూడా జ‌రుగుతుంటుంది. ఈ నేప‌థ్యంలో గుణశేఖర్ దర్శకత్వంలో తాను నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం సమంత అన్నపూర్ణ స్టూడియోస్ కు విచ్చేసింది. అయితే ఈ విషయం తెలియనివాళ్లు అన్నపూర్ణ స్టూడియోస్ కు సమంత ఎందుకు వచ్చి ఉంటుంది అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.ప్రస్తుతం నాగచైతన్య, సమంతల విడాకుల ప్రక్రియ నడుస్తోంది. వారిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement