Friday, May 3, 2024

Animal : ర‌ణ్ బీర్ క‌పూర్ కి.. జీఎస్టీతో క‌లిపి రూ.70కోట్లు

బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టిస్తున్న తాజా చిత్రం యానిమ‌ల్..ఈ మూవీని ద‌ర్శ‌కుడు సందీప్ రెండ్డి వంగా రూపొందిస్తున్నాడు.ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌ణ్ బీర్ కి రూ. 70 కోట్లు జీఎస్టీతో కలిపి రెమ్యున‌రేష‌న్ ని ఇచ్చార‌ట‌. ఇది రణ్ బీర్ కు గత సినిమాల నిమిత్తం అందుకున్న మొత్తంతో చూస్తే చాలా ఎక్కువ. ర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ భారీ సక్సెస్ లను అందుకోవడంతో యానిమల్ పై భారీ అంచనాలు పెట్టుకుంది ట్రేడ్ . రీసెంట్ గా రణ్ బీర్ కు సంబంధించిన డేంజరస్ అండ్ వైల్డ్ లుక్ ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు సందీప్ వంగా. అందులో గొడ్డలి పట్టుకొని ఒళ్లంతా రక్తం, గాయాలతో సిగరెట్ కాలుస్తూ భయంకరంగా కనిపించాడు రణ్ బీర్. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement