Sunday, April 28, 2024

Ranbir Kapoor: యానిమ‌ల్ కు మూడు రోజుల్లో ఇన్ని కోట్లు కలెక్ష‌న్సా…

ఒక్కో హీరోకి సందీప్ రెడ్డి వంగ మరపురాని విజయం ఇస్తున్నాడు. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ చేశాడు. స్టార్ హీరోల సరసన నిలబెట్టాడు. అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి షాహిద్ కపూర్ కి కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. కబీర్ సింగ్ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది.

షాహిద్ కెరీర్లో వంద కోట్ల చిత్రం లేదు. పద్మావత్ మూడు వందల కోట్లు సాధించినా క్రెడిట్ షాహిద్ కపూర్ ఒక్కడికే దక్కదు. ఇప్పుడు రన్బీర్ కపూర్ వంతు. రన్బీర్ కెరీర్లో సంజు రూ. 342 కోట్లతో కెరీర్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఉంది. ఈ రికార్డుని యానిమల్ మూడు రోజుల్లో తుడిపెట్టింది. విడుదలైన అన్ని ఏరియాల్లో యానిమల్ ప్రభంజనం సృష్టిస్తుంది. వీకెండ్ ముగిసే నాటికి యానిమల్ వరల్డ్ వైల్డ్ రూ. 356 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో యానిమల్ కి ఊహించని రెస్పాన్స్ దక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement