Sunday, April 28, 2024

Michaung Cyclone – బాపట్ల స‌మీపంలో తీరం దాటిన తుపాన్..ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల‌లో కుంభ‌వృష్టి

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా సమీపంలో మైచాంగ్ తుపాను తీరాన్ని దాటింది. . దీని ప్రభావంతో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. తీరం దాటడంతో సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కాగా తీరం దాటిన అనంత‌రం తుపాన్ కేంద్రం న‌ల్గొండ‌, ఖమ్మం వ‌రంగ‌ల్ జిల్లాల మీదుగా వెళ్ల‌నుంద‌ని అధికారులు తెలిపారు.. దీని ప్ర‌భావంతో అటు ఎపిలోని ప్ర‌కాశం,గుంటూరు, కృష్ణా, ఇటు తెలంగాణాలోని న‌ల్గొండ‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ లో ఒక మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి..

అలాగే గంట‌ల‌కు 60 నుంచి 65 కిలోమీట‌ర్లు వేగంగా గాలులు వీస్తున్నాయి.. ఈ తుపాన్ ప్ర‌భావం ఎపి, తెలంగాణ‌ల‌లో రెండు రోజుల పాటు వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చ‌ని వాతావ‌ర‌ణం శాఖ వెల్ల‌డించింది.. తుపాన్ పూర్తిగా బ‌ల‌హీన ప‌డేవ‌ర‌కూ ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement