Friday, May 3, 2024

Breaking: రేవంత్ రెడ్డిని సీఎం చేయాల‌ని.. కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

తెలంగాణ సీఎం ఎంపిక‌పై నిన్నటి నుంచి సందిగ్ధ‌త కొనసాగుతోంది. అధిష్టానం నిర్ణయం కోసం పార్టీ నేతలు ఎదురుచూస్తున్నాయి. అయితే హైద‌రాబాద్ లోని గచ్చిబౌలి హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు… రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు… కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు.

ఈ సమయంలో ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దాదాపు రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క వంటి నేతలు పోటీపడ్డారు. అయితే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం డీకే శివకుమార్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేయనున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement