Saturday, April 10, 2021

అక్కినేని అఖిల్‌కు బర్త్ డే గిఫ్ట్ రెడీ

ఈనెల 8న అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అతడి ఐదో సినిమాకు సంబంధించి అప్‌డేట్ రాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఈనెల 8న 9:09 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్‌లో రెండు గన్స్ ఉండగా.. ఒకరు చంపేందుకు రెడీగా ఉన్నారు.. మరొకరు ఆశ్చర్యపరిచేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. ఈ మూవీని AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది. కాగా ఇప్పటివరకు అఖిల్‌ కెరీర్‌లో హిట్ పడలేదు. అతడి నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ మూవీ అయినా బ్రేక్ ఇస్తుందేమో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Prabha News