Friday, May 3, 2024

ఏజెంట్ అప్ డేట్.. రిలీజ్ డేట్ ఎనౌన్స్

సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ మూవీలో హీరోగా అఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. తాజాగా అఖిల్ బర్త్ డే ఒకరోజు ముందే ఏజెంట్ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఏజెంట్ మూవీని రిలీజ్ డేట్ అనౌన్స్ తో పాటు అదిరిపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.ఏజెంట్ మూవీని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మూవీ ఉంది. సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.కాగా అఖిల్ సాలిడ్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తోన్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అఖిల్ ఎంట్రీనే యాక్షన్ డైరెక్టర్ వి వి వినాయక్ తో చేశాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అఖిల్ సినిమా తెరకెక్కింది. కానీ ఈ సినిమా మొన్నామధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ కు సరిపోలేదు. అఖిల్ ను భారీ హిట్ అను ఆశిస్తున్నారు అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement